26 July 2012

వరలక్ష్మి వ్రతము - (About varalakshmi vratam in Telugu)

వరలక్ష్మి వ్రతము  పూజ 

వరలక్ష్మి వ్రతము శ్రవణ మాసము లో మహిళలు జరుపుకొనే ముఖ్యమైన పండుగ. ఈ మాసములో మహిళలు మంగళవారము నాడు మంగళగౌరీ వ్రతము,శుక్రవారము నాడు మహాలక్ష్మి పూజ జరుపుకుందురు.శ్రవణమాసము లో రెండోవ శుక్రవారము నాడు లేదా పౌర్ణమి ముందు రోజు వరలక్ష్మి వ్రతము జరుపుకుందురు.అలా వ్రతము చేసుకొనుట కుదరని వారు శ్రవణమాసము లో వేరే ఏ శుక్రవార మైన జరుపుకొన వచ్చును.ఈ వ్రతము చేసుకొనిన వారికీ లక్ష్మిదేవి వారి కోరికలను నెరవేర్చి సకల సంపదలను,ఆయుర్ఆరోగ్యాలను ప్రసాదించును.


ఈ వ్రతము దక్షణ భారతదేశము లో ప్రాచుర్యము పొందినది.ముక్యముగా ఆంధ్ర ప్రదేశ్,తమిళనాడు,కర్ణాటక రాష్ట్రములలో జరుపుకొందురు.కొత్తగా వివాహమైన మహిళలు తప్పక ఆచరించవలసిన వ్రతము.


శ్రవణమాసం మొదలయిన అప్పటి నుండి మహిళలు నూతన వస్త్రములు మరియు బంగారు ఆభరణములు కొనుగోలు చేయుదురు.లక్ష్మి దేవి కి సుబ్రత అన్న మిక్కిలి ఇష్టము.అందుచేతనే మహిళలు వ్రతము ముందు రోజు ఇంటిని సుబ్రపరచి గడపలకు పసుపురాసి కుంకుమ బొట్లు పెట్టెదరు.పూజ చేయు రోజు మహిళలు ప్రతఃకాలమున బ్రహ్మ గడియలలో లేచి స్నానమాచరించుదురు.పూజ చేయు ప్రదేశమున ముగ్గు పెట్టి అందులో ఒక చిన్న మండపమును నిర్మించెదరు.ముగ్గుపైన బియ్యము పోసి దానిపైన కలశమును వుంచెదరు.కలశము అనగా కొబ్బరికాయను ఉంచే పాత్ర. కొబ్బరికయకు పసుపు పూసి కుంకుమమ బొట్లు పెట్టి దానిపైన ఒక గుడ్డను టోపీ లాగా అమర్చేదరు.కొబ్బరికాయ చుట్టూ పూలతో బంగారముతో అలంకరించెదరు.వినాయకుని పూజతో వరలక్ష్మి వ్రతమును ప్రారంబిస్తారు.


ఒక రోజు పరమేశ్వరుడు కైలాసగిరిలో  ఉన్నప్పుడు పార్వతి దేవి తన సుకసౌభాగ్యము కొరకు వ్రతమును గురించి అడుగగా పరమేశ్వరుడు వరలక్ష్మి పూజా కదను,విదానమును వివరించెను.


ఈ కధ విదర్భ రాజ్యంలో ఉన్న కుందినగరం అనే ఒక అందమైన పట్టణంలో జరుగుతుంది.ఆ కుందినగ్రం పట్టణం లో చారుమతి అనే భక్తురాలి కి ఆదిలక్ష్మికలలో కనిపించి తన కోరికలు  తీర్చే వరలక్ష్మి వ్రతమును ఉపదేశించెను.చారుమతి మేల్కొని కల గురించి ఆమె భర్త కు చెబుతుంది. కొంతమంది  పొరుగు మహిళలను ఆహ్వానిస్తుంది.చారుమతి స్నానమాచరించి , ఒక మండపం సిద్ధం చేసి వరలక్ష్మి దేవిని అత్యధికమైన విశ్వాసం మరియు భక్తి తో పూజించి ఈ క్రింది శ్లోకాన్ని పటించింది.


లక్ష్మి  క్షీరసముద్ర  రాజతన్యం  శ్రీ  రంగాధమేస్వరీం
దసిబూత  సమస్త  దేవవనితం  లోకైక  దీపంకురం
శ్రీ  మనమంద  కటాక్ష  లబ్దివిభాట్  బ్రహ్మేంద్ర  గంగాధరం
త్వంత్రయంలోక్యకుతుమ్భినీం  ససిజవందేముకుండా  ప్రియం.


తరువాత తన కుడి చేతికి తొమ్మిది తోరాలను కట్టుకుని లక్ష్మి దేవి కి నైవేద్యం సమర్పించింది.మొదటి తంతు పూర్తీ అయిన తరువాత ఆమెకు గజ్జెలు,ఇతర ఆభరణాలు లభ్యమయ్యాయి .రెండోవ తంతు ముగిసేసరికి చేతులకి నవరత్న కంకణములు వచ్చాయి.మూడోవ తంతు ముగిసేసరికి వెలకట్టలేనంత సంపద ప్రత్యక్షమయింది.చారుమతి బ్రాహ్మణులకు తాంబూలం సమర్పించుకుని,తీర్ధ ప్రసాదాలు బంధువులకు ఇచ్చి సంతోషముగా గడపసాగింది.అప్పటినుండి హిందూ మహిళలు ఈ వ్రతమును అత్యంత భక్తీ శ్రధలతో ఆచరిస్తారు.దేనితో పరమేశ్వరుడు కధను ముగించినాడు.


వరలక్ష్మి అత్యంత హిందూమత కుటుంబాల గృహ దేవత.నాలుగు చేతులతో, బంగారు ఛాయతో  పూర్తిగా పుష్పించిన ఎరుపు తామర పువ్వు ఫై కూర్చొని లేదా నిలబడినట్లు చిత్రించినారు.తామర  సంతానోత్పత్తి, స్వచ్ఛత మరియు అందం సూచిస్తుంది.ఆమె నాలుగు చేతులు జీవితం నుండి ధర్మానికి, కోరిక, సంపద మరియు విముక్తి సూచించును.బంగారు నాణాలు ఆమె చేతినుండి రాలటం ఆమె భక్తుల సంపద మరియు దైవ దీవెనలు సూచిస్తుంది,లక్ష్మిదేవి బంగారు చేనేత ఎరుపు చీర ధరించి కనిపిస్తుంది.రుపు అదృష్టం సూచిస్తుంది మరియు బంగారు సంపద సూచిస్తుంది. ఆమె ఎల్లప్పుడూ సంపన్నమైన బంగారు ఆభరణాల తో కనిపిస్తుంది. కొన్ని వర్గాలలో  వరలక్ష్మివ్రతం వంటి సందర్భంలోనే బంగారు ఆభరణాల కొనుగోలు ధోరణి కూడా ఉంది.

 "ఓం రిం శ్రీం లక్ష్మిభ్యో నమః"

No comments:

Post a Comment